Varahi Mantram : ప్రతి ఒక్కరికి కూడా మంచే జరగాలని ఉంటుంది. సమస్యలు ఏమి లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఉంటుంది. నిజానికి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు ఒకటి. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలన్నా ఈ విధంగా అనుసరించండి.
ఇలా కనుక చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన నష్టం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వద్దన్నా కూడా డబ్బు మీ ఇంట్లో ఉంటుంది. డబ్బులు రావాలంటే ఎంతగానో కష్టపడాలి. ఎంతో కష్టపడితే కానీ ఒక్క రూపాయి కూడా రాదు. డబ్బుని ఖర్చు చేయడం చాలా సులభం, కానీ సంపాదించడం ఎంతో కష్టం. వ్యాపారులైనా ఉద్యోగులైనా డబ్బు కోసమే కదా పని చేసేది.
ఈ విధంగా కనుక మీరు పాటించారంటే జీవితం ఎంతో బాగుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మంచినీళ్లు తాగేటప్పుడు వారాహి దేవిని తలుచుకోండి. ఇలా మంచినీళ్లు తాగితే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక బాధ్యతల నుండి బయటపడొచ్చు.
శ్రీం శ్రీం శ్రీం శ్రీం అని నీళ్లు తాగేటప్పుడు చెప్పుకుని వారాహి దేవిని తలుచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. బాధల నుండి బయటపడొచ్చు ఇలా ప్రతి రోజూ మంచి నీళ్లు తాగేటప్పుడు ఈ విధంగా చెప్పుకుంటే మీ ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. ఆర్థిక బాధల నుండి బయటపడడానికి వీలవుతుంది.