Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

అమ‌వాస్య‌, పౌర్ణ‌మి రోజుల్లో ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

Admin by Admin
June 22, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కొంత మంది ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. వారు ప్రతీ దానికి కోపం తెచ్చుకుంటారు. మూడ్ స్వింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాళ్లకు కూడా వీరి గురించి తెలుసు.. అమావాస్య కదా ఇలానే చేస్తాడులే అంటుంటారు. అంటే మనిషి ఆరోగ్యంపై చంద్రుడి ప్రభావం ఉంటుందా..? ఇందులో నిజం ఎంత ఉంది..? సూర్యుడి వల్ల అంటే విటమిన్‌ డీ వస్తుంది కాబట్టి.. ఎఫెక్ట్‌ ఉంటుంది అనుకోవచ్చు. చంద్రుడి వల్ల ఏం జరుగుతుందబ్బా..? పౌర్ణమి నాటి చంద్రుడి ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. పౌర్ణమి చంద్రుడు, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావాలకు సంబంధించి పరిశోధకులు కనుగొన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి. చంద్రుని చక్రాలు మనిషి హృదయ స్పందనలపై ప్రభావం చూపుతాయని అధ్యయనం ద్వారా కనుగొన్నారు.

పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో వ్యాయామాలు చేస్తున్నప్పుడు హృదయ స్పందనలు సాధారణం కంటే మరింత హెచ్చుగా ఉంటాయట. కాబట్టి ఎప్పుడైనా వ్యాయామాలు చేసేటపుడు అమావాస్య లేదా పౌర్ణమి రోజు వ్యాయామ తీవ్రత తగ్గించుకోండి, లేదా ఆరోజు చేయకండి. మనిషి మెదడులో ఆటుపోట్లకు చంద్రుడు కారణం కావచ్చు. మెదడులో నీటి శాతం ఎక్కువ ఉన్నందున, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మీ మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని డచ్ పరిశోధకులు అంటున్నారు. ఈ కారణంగా పౌర్ణమి లేదా అమావాస్య రోజున మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయనేది డచ్ పరిశోధకుల అభిప్రాయం. బ్రిటీష్ శాస్త్రవేత్తలు చేసిన ఇతర అధ్యయనాల ప్రకారం నిండు పౌర్ణమి , మూర్ఛ వ్యాధిగ్రస్తులలో మూర్ఛలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు, మూర్చ రోగుల్లో ఎపిలెప్టిక్ మూర్ఛలు తక్కువ ఉన్నట్లు వారు గమనించారు. సూర్యుడు అస్తమించినప్పుడు మెదడులో సహజంగా స్రవించే మెలటోనిన్ అనే హార్మోన్ దీనికి కారణం అవుతుందట. పౌర్ణమి రోజు ఈ హార్మోన్ శాంత ప్రభావాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు.

we must be careful on these 2 days in a month

చంద్రకాంతి మనిషి నిద్ర విధానాలపై ప్రభావం చూపుతుందని కరెంట్ బయాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం చెబుతోంది. ప్రకాశవంతమైన చంద్రుడు ఉన్నప్పుడు మెలటోనిన్ స్థాయిలు తక్కువగా ఉండటమే కాకుండా, నిద్రపోవడానికి 5 నిమిషాలు ఎక్కువ సమయం పట్టిందని, అలాగే సాధారణం కంటే 20 నిమిషాలు తక్కువ నిద్రపోతారని పరిశోధకులు గుర్తించారు. రోజూవారీగా కంటే 30 శాతం తక్కువ REM ఉందని పరిశోధకులు నిర్ధారించారు. స్త్రీలలో సగటు ఋతు చక్రం 28 రోజులు, ఇది 29+ రోజుల చంద్ర చక్రంతో సమానంగా ఉంటుంది. చైనీస్ పరిశోధకుల ప్రకారం.. ఈ సమయం యాదృచ్చికం కాకపొవచ్చు, వారి పరిశోధనల్లో భాగంగా కొంతమంది స్త్రీల ఋతుచక్రాలను పర్యవేక్షించారు. దాదాపు వారందరిలో పౌర్ణమి దగ్గరలో అండోత్సర్గము, అమావాస్య సమయంలో ఋతుస్రావం అవుతుందని కనుగొన్నారు. భూమిపైన సంతానోత్పత్తికి చంద్రుడి ప్రభావానికి ఇది నిదర్శనం.

యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పౌర్ణమి సమయంలో కిడ్నీ స్టోన్ నొప్పి అధికంగా ఉంటుందట. ఈ సమయంలో ఎక్కువ మంది రోగులు ఆసుపత్రులలో చేరారని కనుగొన్నారు. దీనికి విరుద్ధంగా, అమావాస్య రోజున కిడ్నీలలో నొప్పి నుంచి ఉపశమన ప్రభావాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, కిడ్నీ నొప్పిలో హెచ్చుతగ్గులకు చంద్రుని ప్రభావాలే కారణం అని కచ్చితమైన ఆధారాలు లేవు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఇలా పౌర్ణమి చంద్రుడి ప్రభావం మన ఆరోగ్యంగంపై కచ్చితంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. అందుకే అమావాస్య, పౌర్ణమి రోజు కాస్త జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దలు.

Tags: moon
Previous Post

ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే.. అన్నీ పోతాయి..!

Next Post

శ‌నివారం నాడు ఇలా చేస్తే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా పోతాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.