ఎలాంటి పూజ అయినా.. పెళ్లి అయినా.. ఆలయాల్లో ప్రతిష్టలైనా.. కళ్యాణోత్సవాలైనా.. ముందు పూజలందుకునేది ఆది దేవుడు గణపతి. అందరికంటే ముందు అగ్రపూజలు అందుకుంటాడు వినాయకుడు. మనం చేసే పూజలు, పెళ్లిళ్లు, కార్యాలు ఏవైనా ఎలాంటి విఘ్నం లేకుండా పూర్తి అవ్వాలనే ఉద్ధేశ్యంతోనే ముందుగా గజాననుడిని పూజిస్తారు. ప్రతి ఇంట్లో బొజ్జ గణపయ్యకు స్థానం ఉంటుంది. అయితే వినాయకుడు రకరకాల లోహాల విగ్రహాలతో ఉంటాడు.
మట్టి విగ్రహం, రాగి, వెండి, పంచలోహం వంటి వాటితో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి. అయితే ఏ లోహంతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారో చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మట్టి వినాయకుడిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే వినాయక చవితి రోజు మట్టి గణపయ్యను పూజిస్తే.. ఎలాంటి పనిలో అయినా విజయం సాధిస్తారు. రాగితో చేసిన గణపతిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అన్నివేళలా ఉంటుంది.
రాతి వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే మోక్షం లభిస్తుంది. వెండి వినాయకుడిని పూజిస్తే.. కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఇంకా పవిత్రమైనది జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహం. ఈ విగ్రహం ఇంట్లో ఉన్నా.. పూజలు చేసినా.. సకల దరిద్రాలు నశిస్తాయి. ఎందుకంటే.. తెల్లజిల్లేడు వేరులో వినాయకుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎలాంటి వాస్తు దోషాలు మీద పడకుండా ఉంటాయి.