సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన తాజా చిత్రం వేట్టయన్.అక్టోబర్ 10 న భారీ అంచనాలతో మధ్య వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజైంది. జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, రావు రమేష్, అభిరామి, రమేష్ తిలక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. చిత్రంలో రజనీకాంత్ పోలీస్ పాత్రలో కనిపించారు.
చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని, న్యాయం కోసం నిలబడే సూపర్ కాప్ రజనీకాంత్ అయితే, అమితాబ్ బచ్చన్ సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల ఛాంపియన్ చట్టాన్ని కాపాడుతూ ఉంటాడు. మొత్తం స్టోరీ ఇన్వెస్టిగేషన్ పై నడుస్తుంది. డైలాగులు బాగున్నా కూడా కాస్త ఎక్కువగా మెసేజ్ లు ఇచ్చినట్లు తెలుస్తుంది. చిత్రంలో దుషార విజయన్‌పై అత్యాచారం సన్నివేశం ఉంటుంది. ఇది చాలా మంది ప్రేక్షకులను కలవరపెట్టింది. దీంతో పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. దుషార విజయన్ లైంగిక వేధింపుల సన్నివేశాన్ని క్లోజ్-అప్ షాట్‌లలో చూపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటివి A- రేటింగ్ ఉన్న చిత్రంలో చూపిస్తారు, కానీ UA సర్టిఫికేట్ ఉన్న సినిమాలో ఇంత దారుణమైన రేప్ సన్నివేశాన్ని ప్రదర్శించకూడదు అంటూ ఫైర్ అవుతున్నారు.
ఆ సన్నివేశాలు ప్రేక్షకులని చాలా ఇబ్బంది పెట్టాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఈ మూవీపై కూడా విమర్శలు చేస్తున్నారు.టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెట్టయన్ మూవీలో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీకాంత్ తో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించారు. అలాగే.. వేట్టయన్ మూవీ విడుదలకు ముందే.. రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను రూ. 73 కోట్లకు రెడ్ జెయింట్ సంస్థ సొంతం చేసుకుంది.