ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో రమ్యకృష్ణ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆమె వయసు పెరిగినా కానీ ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఆమె తెరపై కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం గడగడ లాడాల్సిందే. ఆమె దేవతగా అవతారమెత్తిన, శివగామి గా మారిన, విలన్ క్యారెక్టర్ చేసిన, పోలీస్ డ్రెస్ వేసుకున్న ఏ పాత్రలోనైనా రమ్యకృష్ణ నటనా చాతుర్యము వేరు.. అంత టాలెంట్ ఉంది కాబట్టే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది.
ఇక పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన బాహుబలి సినిమాలో ఆమె నటన మాత్రం మరో లెవెల్ అని చెప్పవచ్చు. ఆమె ఆ సినిమాకు ఒక్క రోజుకు ఎంత పారితోషికం తీసుకుందో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. తను హీరోయిన్ గా చేసి కొన్నాళ్ళు ఇండస్ట్రీకు దూరంగా ఉన్నారు. తర్వాత బాహుబలితో సెకండాఫ్ మొదలుపెట్టిన రమ్యకృష్ణ శివగామి పాత్రతో మళ్లీ అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. స్టార్ నటి కాబట్టి పారితోషికం కూడా ఆ లెవెల్ లోనే ఉంది. రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ ఎవరంటే రమ్యకృష్ణ అని చెప్పవచ్చు.
ఆయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి కుర్రకారును నిద్ర పట్టకుండా చేసిన సుందరి ఈమె. దీని తర్వాత తల్లి,వదిన, అమ్మమ్మ లాంటి పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ ఒక రోజుకు 10 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందట, అంటే పది రోజులకు కోటి రూపాయలు అన్న మాట. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటుంది. దాన్ని బట్టి చూస్తే రమ్యకృష్ణ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.