సినిమా వాళ్లు కదా, కోట్లలో డబ్బులు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు తింటారు అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా చాలా డైట్స్ ఉంటాయి. కోట్లు ఉన్నా కూడా కడుపునిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు ఇష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా కొందరు కడుపు కట్టుకుని ఉంటారు. అయితే మరి కొందరు మాత్రం బాగా తినేసి ఆ తర్వాత కొవ్వు కరిగించే పనిలో జిమ్ లో కుస్తీలు పడుతుంటారు. మొత్తానికి ఎలా చేసినా కూడా మన స్టార్స్ కు కూడా కొన్ని ఫేవరెట్ ఫుడ్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
సీ ఫుడ్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే ప్రాణం. రాజు గారి పులావ్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇష్టం. బాలయ్యకు చికెన్ బిర్యాని అంటే బాగా ఇష్టం. అలాగే రొయ్యలను కూడా ఇష్టంగా తింటారు. నెల్లూరు చేపల పులుసు, నాటుకోడి పులుసు, అరటికాయ వేపుడు, పప్పు, లెమన్ రైస్.. ఇవన్నీ ఉంటే పవన్ ఇంకేం అడగడు. మహేష్ బాబుకు బిర్యానీ, చేపల పులుసు అంటే చాలా ఇష్టం.
బిర్యానీ అంటే రామ్ చరణ్ కు భలే ఇష్టం. చూడడానికి క్యూట్ గా ఉంటాడు కదా అందుకే నానికి ఇడ్లీ, సాంబార్ తో పాటు కిచిడి అంటే బాగా ఇష్టం. అక్కినేని మాజీ కోడలు సమంతకు హాట్ ఫిల్టర్ కాఫీ, స్వీట్ పొంగల్ బాగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్‌కు బిర్యానీ, నాటు కోడి పులుసు, గారెలు అంటే చాలా ఇష్టం.