మసూద.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పేరు మారుమోగింది. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడవ చిత్రం మసూద. హర్రర్ – డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను వణికించింది. చాలా కాలం తర్వాత హారర్ జోన్ లో వచ్చిన మసూద సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట ట్రైలర్ తో వచ్చిన అంచనా.. సినిమా విడుదలైన తరువాత మౌత్ టాక్ తో నెక్స్ట్ లెవెల్ కి చేరింది.
మొదట తీసుకున్న థియేటర్ల సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శుభలేఖ సుధాకర్, సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రంలో నీలం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. తన భర్తకి దూరంగా ఉంటూ కూతురితో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంటుకి ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉండే గోపి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తాడు. తన సహోద్యోగిని మినీ ని ప్రేమిస్తూ ఉంటాడు గోపి. కానీ ఆ విషయం ఆమెకు చెప్పడానికి భయపడతాడు. ఇక అపార్ట్మెంట్లోనే ఉన్న నీలం ఫ్యామిలీకి క్లోజ్ అవుతాడు గోపి. అప్పుడప్పుడు నీలం, గోపి, నదియా బయటకి వెళుతుంటారు. అయితే ఓ రోజు నదియా వింతగా ప్రవర్తిస్తుంది. అర్ధరాత్రి వేళ తనతో తానే మాట్లాడుకుంటుంది. అది చూసి భయపడిన నీలం గోపిని సహాయం అడుగుతుంది.
ఆమె ప్రవర్తనను చూసిన గోపి ఆమెకు దయ్యం పట్టింది అని గ్రహిస్తాడు. ఆమెను బాగు చేసేందుకు చేసే ప్రయత్నాలలో వారు మసూద అనే అమ్మాయి గురించి తెలుసుకుంటారు. అసలు ఎవరు ఆ మసూదా? అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో కీలకమైన మసుధ పాత్రను బుర్ఖా లో చూపిస్తారు. అయితే ఈ మూవీ సాధించిన సక్సెస్ ని ప్రేక్షకులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మసూదని పరిచయం చేసింది మూవీ యూనిట్. మసూద పాత్ర చేసిన ఆమె పేరు అఖిలారామ్. ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. అఖిల హిందీలో లిఫ్ట్ 8055 అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఈమెని బుర్ఖా లో చూసిన ఫ్యాన్స్ నేరుగా చూసి తెగ ఆనందపడిపోయారు. ఇక మరి కొంతమంది మాత్రం ఇంత అందమైన అమ్మాయికి బుర్కా ఎలా వేశారంటూ ప్రశ్నించారు.