సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ తెగ హల్‌చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ దగ్గర్నుంచి.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ వరకు వారి చిన్నప్పటి పిక్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సాధారణంగా సినీ ప్రియులు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఆ క్రమంలోనే తాజాగా ఓ ఇద్దరు స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరలవుతుంది. ఈ పిక్‌లో చూస్తే ఇందులో మనకు కనిపిస్తున్న వారు బావబామ్మర్దులు.. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్.
సెలబ్రెటీస్ ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన హీరోగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ ఇద్దరు హీరోలు. చిన్నప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తుంటే అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు దగ్గుపాటి రానా, అక్కినేని నాగచైతన్య ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. రానా మేనత్త దగ్గుబాటి శ్రీలక్ష్మిని ముందుగా నాగచైతన్య తండ్రి స్టార్ హీరో నాగార్జున పెళ్లి చేసుకోగా, అనంతరం మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అయితే రానా నాగచైతన్య వరుసకు బావబామ్మర్దులు అవుతారు.
అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన చైతూ.. తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మాత్రం మెప్పించాడు. ఇక రానా విషయానికి వస్తే లీడర్ చిత్రంతో పలకరించాడు. బాహుబలిలో భళ్లాలదేవగా అదరగొట్టాడు. భల్లాల దేవ పాత్రలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టాడు రానా. చివరిసారిగా విరాటపర్వం సినిమాలో కనిపించిన రానా.. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు.