ఈ మధ్యనే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంటే చూశాను ఈ సినిమాని. దర్శకుడికి ఇది మొదటి సినిమా అని తెలిసింది. మరి అనగనగా మూవీ బాగుందా అంటే…? నాకైతే నచ్చేసింది ఫ్రెండ్స్. ఎంతలా అంటే సినిమా అయిపోయిన గంట తర్వాత కూడా కన్నీళ్ళు ఆగలేదు. అంతలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూశానని అనిపించింది. మొత్తానికి నాకైతే బాగా నచ్చిందండీ. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. అట్లాగే మీకు ఈ సినిమా నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.
కథ పరంగా చూసుకుంటే మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వాటికి చక్కని పరిష్కారాన్ని కూడా చూపించారు. ఇక్కడ దర్శకుని ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. మొదటి సినిమా అయినా కానీ ఎక్కడ తడబడకుండా చాలా క్లారిటీతో సినిమా తీశాడు. ఎక్కడా ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ మరియు అడల్ట్ సీన్స్ లేవు కాబట్టి కుటుంబంతో సహా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు.
ఒక పక్క విద్యా వ్వస్థలోని లోపాలకి సంబంధించిన సమస్యను ప్రస్తావిస్తూనే ఇంకో పక్క తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా మనసుకి హత్తుకునేలా చూపించాడు దర్శకుడు. నేనైతే ఆ సెంటిమెంట్ సీన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాను. హీరో సుమంత్ మరియు అతని కొడుకు క్యారెక్టర్ చేసిన మాస్టర్ విహర్ష్ నటన కట్టి పడేస్తుంది. హీరోయిన్ కాజల్ చౌదరికి మొదటి సినిమా అయినా కానీ చాలా బాగా నటించింది తను. మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు.