RRR Movie Scene : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలు దిశలకు చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఈ చిత్రం రూపొందింది. మన దేశానికి పూర్తి స్థాయిలో తొలి ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ఒక యేడాదిలో ఆర్ఆర్ఆర్ మూవీ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌లో అందరు నోళ్లలో నానుతూనే ఉంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో ఒక్కటే ట్రెండ్. చిత్రం విడుదలయ్యాక కొన్ని నెలల పాటు ఎలా అయితే ఈ పాటతో దేశం మారుమోగిపోయిందో.. ఇప్పుడు ఇదే పాటకు ప్రపంచ సినీ ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డు ఆస్కార్ రావడంతో యావత్ భారతీయ ప్రేక్షకులు హుషారెత్తిపోతున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంకి ఆస్కార్‌తో పటు అనేక అవార్డులు దక్కాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్ , క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ – ఉత్తమ పాట , హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్ , హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్ , లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ – ఉత్తమ సంగీతం , బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ – ఉత్తమ ఒరిజినల్ స్కోర్, పండోర ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ – బెస్ట్ సాంగ్ కంపోజింగ్, ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఇలా పలు విభాగాలలో ఆర్ఆర్ఆర్ సినిమా సత్తా చాటింది.
ఈ సినిమాలోని రామ్ చరణ్, ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్ తో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్ ఫైట్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.సినిమా మొత్తం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సపరేట్ గా పోరాడతారు. కాని చివరలో మాత్రం ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఇది అభిమానులకి కనుల పండుగలా అనిపించింది. అయితే ఈ క్లైమాక్స్ ఫైట్ లో జక్కన్న చిన్న మిస్టేక్ కూడా చేశాడు. ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించే జక్కన్న ఈ మిస్టేల్ ఎలా చేశాడో మరి. క్లైమాక్స్ ఫైట్ లో రామ్ చరణ్ రామరాజు లుక్ లో విల్లు పట్టుకుని కనిపిస్తాడు. అయితే ఫైటింగ్ సమయంలో రామరాజు భుజానికి ఓ సీన్ లో బాణాలు కనిపిస్తే మరో సీన్ లో మాత్రం బాణాలు కనిపించలేదు. ఓటీటీలో చిత్రం రిలీజ్ అయ్యాక దీనిని గుర్తించి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.