గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల బిజినెస్ చాలా పెరిగింది. ఈ క్రమంలోనే హీరోల మార్కెట్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. సినిమాలు విడుదలకముందే వందల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయితే అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా షోలే. ఇండియన్ సినిమాలలోనే గొప్ప సినిమా షోలే. చాలా మంది ఫిలిం మేకర్స్ కి ఈ మూవీ పెద్ద ఇన్స్పిరేషన్. అయితే.. ఇప్పటి వరకు ఎక్కువగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమా వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమితా బచ్చన్ హీరోగా చేసిన షోలే సినిమా సమయంలో, 150 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి 2 : ద కంక్లూజన్ సినిమా సమయంలో 120 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ముఘల్ ఈ అజాం సినిమా టైములో 100 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. మదర్ ఇండియా సినిమా సమయంలో 100 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.
హమ్ ఆప్కే హైన్ కౌన్ సినిమా టైములో 74 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. కూలీ సినిమా సమయంలో 70 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ముక్వద్దార్ కా సికందర్ సినిమా సమయంలో 67 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా సమయంలో 62 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. క్రాంతి సినిమా టైములో 60 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. బాబి సినిమా సమయంలో 53 మిలియన్ల టికెట్ అమ్ముడుపోయాయి.