మనలో చాలా మంది తేనె మనసులు కృష్ణ తొలి చిత్రం అనుకుంటారు. అయితే పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. చిన్నా చితకా పాత్రలు కూడా పోషించారు. అలాంటిదే ఈ స్టిల్. 1962 లో కొంగర జగ్గయ్య హీరోగా నటించిన పదండి ముందుకు చిత్రంలో స్వాతంత్ర్య సమర యోధులలో ఒకనిగా కనిపించారు. ఈ చిత్రం అవుట్ డోర్ షూటింగు కొంత భాగం తెనాలిలో తీశారు.
అందులో ఓ వాలంటీర్ పాత్ర అవసరం అయింది. ఆరా తీస్తే బుర్రిపాలెం లో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు అన్నారు. ఆయనే కృష్ణ. అప్పటికే ఎల్ వి ప్రసాద్ కొడుకులు – కోడళ్ళు సినిమాలో వేషం వుంది మద్రాస్ రమ్మని కబురు పంపారు. తీరా వెళ్తే, నలుగురు హీరోల్లో ఒకడు. అయినా నెల రోజులలో రిహార్సల్స్ ఉన్నాయి తర్వాత రమ్మన్నారు. పోన్లే ఏదో ఒక వేషం అని సరిపెట్టుకుని ఇంటికి వచ్చారు. ఈ లోపు ఈ వేషం ఇచ్చారు.
అలాగే కులగోత్రాలు, మురళీ కృష్ణ వంటి చిత్రాల్లో చిన్న వేషాలు చేశారు. తేనె మనసులు చిత్రంలో హీరోగా నటించిన తర్వాత ఆయన దశ తిరిగింది.