Viral Photo : ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంత మంది స్టార్ హీరోయిన్స్ అయితే వారి ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. కొందరైతే గుర్తుపట్టేసి హింట్స్ కూడా ఇస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మను మీరు గుర్తుపట్టారా..? గుర్తుపట్టలేకపోతే కింద ఫోటో చూడండి అంటూ.. ఇంతకీ పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? చిరునవ్వులు చిందిస్తూ.. ఫోటోకు ఫోజులిస్తున్న ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.
ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. చేసింది తక్కువే సినిమాలు కానీ అబ్బాయిలకు హాట్ ఫేవరెట్.. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బేబమ్మా అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు.. ఎవరో గుర్తుపట్టారా..? ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఆమెవరో కాదు కృతి శెట్టి. టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి.. వెంట వెంటనే క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.
అంతేకాకుండా ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. అబ్బాయిల్లో బాగా పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్, బంగార్రాజుతో వరుస హిట్లు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఫ్లాప్ అయినా బేబమ్మా చేతిలో చాలానే క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. కృతిశెట్టి అటు మలయాళం ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధమవుతోంది.