Viral Photo : సోషల్ మీడియాలో నటీనటులకు సంబంధించిన చిన్ననాటి పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు సెలబ్స్ తమ చిన్ననాటి పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తుండగా, మరి కొందరికి సంబంధించిన చిన్నప్పటి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ పిక్ లో కనిపిస్తున్న చిన్నారి ఓ హీరో కాగా, ఆయనకు సంబంధించిన ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ పిక్ చూస్తే ఏ హీరో గుర్తుకొస్తున్నాడు. గుర్తు పట్టడం కాస్త కష్టమైన కూడా ఈ హీరో పాపులర్ హీరో అని అర్ధమవుతుంది. మరి ఈ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్.
హ్యాపీడేస్ చిత్రంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన నిఖిల్ ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేశాడు. నిఖిల్ గత రెండేళ్లుగా పెద్ద రిలీజ్ లు లేకపోవడం తో అస్తవ్యస్తంగా ఉన్నాడు. అతని ప్రత్యేక చిత్రం, కార్తికేయ 2 చాలా ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. కానీ, ఈ చిత్రం విడుదలయ్యాక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు. ఈ సినిమా విజయంతో నిఖిల్ ఇప్పుడు తన ఫీజును భారీగా పెంచేశాడు. మొదట్లో ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు వసూలు చేసిన ఆయన ఇప్పుడు సైన్ చేసిన కొత్త సినిమాలకు 8 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 తో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు ఆ పాపులారిటీని పూర్తిగా ఉపయోగించు కుంటున్నాడు.
అయితే దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఇండస్ట్రీ జనాలకు బాగా వంటబడుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లంతా కూడా చేసేది ఇదే. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తారు. ఎంత సంపాదించుకోగలరో అంత సంపాదించేసుకుని సైడ్ అయిపోతారు. అయితే నిఖిల్ కూడా ఇప్పుడు తనకు క్రేజ్ పెంచుకుంటున్న నేపథ్యంలో రెమ్యునరేషన్ పెంచినట్ట తెలుస్తుంది.