ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో కుర్ర కారును ఉర్రుతలుహించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నమ్మాయి.. ప్రస్తుతం కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ తనదైన నటనతో అలరిస్తోంది.. ప్రస్తుతం తల్లి పాత్రలు, వదిన పాత్రలు ఏవైనా సరే తనకు తానే సాటి అని చెప్పవచ్చు. అలనాడు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ,నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మంచి హిట్లు అందుకుంది.
కేవలం హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా సినిమాల్లో చేసి గుర్తింపు తెచ్చుకుంది.. మరి ఆ హీరోయిన్ ఎవరో మీకు గుర్తొచ్చిందా.. మరి పూర్తిగా చూద్దాం.. అమాయకంగా కనిపిస్తున్న అమ్మాయి హీరోయిన్ రమ్యకృష్ణ.. 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో పుట్టిన ఆమె 1985లో వచ్చిన భలే మిత్రులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 1990లో టాప్ హీరోయిన్‌గా కొనసాగి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేసింది.
ఇక తెలుగులో అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, అల్లుడు గారు, ఆవిడే శ్యామల, చంద్రలేఖ, అన్నమయ్య, ఆహ్వానం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఈమె స్టార్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. బాహుబలి మూవీ ద్వారా జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపును దక్కించుకుంది.