Viral Photo : హీరోయిన్స్ తమ అందచందాలతో అభిమానులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టించే ముద్దుగుమ్మలు చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఆ రోజుల్లో వీరి లుక్స్ ఎలా ఉండాయి అని తెలుసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి కొందరు ప్రముఖుల చిన్ననాటి పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అలా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా. ఢిల్లీ భామ రాశీ ఖన్నా.
మద్రాస్ కేఫే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రాశీ.. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈమె పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత థాంక్యూలో నటించింది. అది కూడా ఫ్లాప్ కావడంతో ఈ భామకి ప్రస్తుతం తెలుగులోపెద్దగా ఆఫర్స్ లేవు. ఇటీవల రాశీ ఖన్నా కూడా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది.
ఇక ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భామ ఇటీవల రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చేశారట. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఆమె భయపడ్డారట. . యాక్టర్‌కు ఎంకరేజ్‌మెంట్ ఉంటే వీలున్నప్పుడల్లా ఇలాంటీ కొత్త పాత్రల్లో నటించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రానున్న రోజులలో రాశీ ఖన్నా మరిన్ని మంచి పాత్రలతో అలరించే ప్రయత్నం చేయనుందని చెప్పుకొచ్చింది.