Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంతకు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆమెపై వస్తున్న ట్రోల్స్ ఆగడం లేదు. ఇక తాజాగా సమంతపై ఓ నెటిజన్ పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు.
సమంత డైవోర్స్ తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అని.. ఓ మంచి వ్యక్తి నుంచి రూ.50 కోట్ల ట్యాక్స్ ఫ్రీ డబ్బును దోచేసిందని.. ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే అందుకు సమంత స్పందించింది.
సదరు నెటిజన్ పేరును ఉద్దేశించి మాట్లాడుతూ.. గాడ్ బ్లెస్ యువర్ సోల్ అని పేర్కొంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సమంత ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే ఆమె పుష్ప మూవీలో ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. అనే ప్రత్యేక సాంగ్‌లో నటించి అలరించింది.
కాగా సమంత, నాగచైతన్య అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు కనుక.. 6 నెలల్లో అంటే.. ఏప్రిల్ వరకు వీరికి విడాకులు మంజూరు అవుతాయని తెలుస్తోంది. ఇక సమంతకు రూ.200 కోట్ల భరణం ఇచ్చేందుకు నాగచైతన్య రెడీ అయ్యాడని, కానీ ఆమె ఆ మొత్తాన్ని తీసుకునేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన శాకుంతలం మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఓ బాలీవుడ్, ఓ హాలీవుడ్ మూవీలో సమంత నటించనుంది. వీటి షూటింగ్ లు త్వరలో ప్రారంభం కానున్నాయి.