Samantha : నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి సమంత ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆమెపై అప్పట్లో చాలా మంది తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కొన్ని సినిమాలు, సిరీస్‌లలో అందాలను ఆరబోసే సీన్లు చేయడంతోనే మనస్థాపం చెందిన చైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని.. ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులకు కూడా నచ్చలేదని.. అందుకనే విడాకులు ఇప్పించారని అన్నారు. ఈ క్రమంలోనే సమంత ఈ విషయంలో విపరీతమైన ట్రోలింగ్‌ను, విమర్శలను ఎదుర్కొంది. అయితే ఇప్పటికీ ఆమె గురించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లి అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. అయితే తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందంటూ.. వార్తలను ప్రచారం చేస్తున్నారు. వాటిలో ఏమాత్రం నిజం లేకపోయినప్పటికీ కేవలం వ్యూస్ కోసం అలా చేస్తున్నారని స్పష్టమైంది. ఇలాంటి రాతలపైనే సమంత అప్పట్లో కోర్టు వరకు వెళ్లింది. అయినప్పటికీ కొందరు ఇప్పటికీ అలాగే చేస్తున్నారు. మరి తాజాగా ప్రచారం అవుతున్న ఈ వార్తలపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె తమిళంలో కాతువాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటించగా.. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. అలాగే శాకుంతలం, యశోద అనే సినిమాల్లోనూ ఈమె నటిస్తోంది. ఇక ఈ మధ్యే ఓ అవార్డుల కార్యక్రమంలో సమంత ధరించిన డ్రెస్ వివాదాస్పదం అయింది. ఆమెపై చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఆమె అన్నింటికీ దీటుగా రిప్లై ఇచ్చింది.