సాధారణంగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతాము.ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏర్పరుచుకునే ప్రతి ఒక్క వస్తువును కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చుకుంటారు. అయితే చాలామంది తమ ఇంట్లో గోడలకు వివిధ రకాల ఫోటోలను అతికిస్తారు. అయితే కొన్ని రకాల పోస్టర్లను అతికించడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడే అనేక సమస్యలు తలెత్తుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఫోటోలు ఉండకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
మన ఇంట్లో ఎప్పుడూ కూడా క్రూర జంతువుల ఫోటోలను గోడకు అంటించకూడదు. ఈ విధమైనటువంటి ఫోటోలు అతికించడం వల్ల మన ఇంటి పై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు తలెత్తడం, మానసిక ఆందోళనలు తలెత్తుతాయి. అదేవిధంగా చాలామంది ఇంటిలో మునిగిపోతున్న టువంటి పడవ ఫోటోలను అతికిస్తారు. ఈ విధమైనటువంటి ఫోటో ఉండటం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ విధమైనటువంటి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడంమేకాకుండా, దురదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. అదే విధంగా ఈ యుద్ధాలలో ఉపయోగించే కత్తులు వంటి ఫోటోలు ఇంట్లో ఉండకూడదు.ఈ ఫోటోలు కుటుంబం పై ప్రతికూల ప్రభావాన్ని ఏర్పరిచి అనేక సమస్యలకు దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.