స్నేహ.. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది వాటిలో సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు. ఆతర్వాత ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ భామ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది. చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతోనూ ఆకట్టుంది స్నేహ.
తెలుగులో వరుసగా హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మహారధి, మధుమాసం, సంక్రాంతి, వెంకీ, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగడు లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత స్నేహ ఈ మధ్యకాలంలో సహాయక పాత్రల్లో నటిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధేయ రామ సినిమాల్లో సహయక పాత్రల్లో మెరిసింది స్నేహ. కాగా విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలో ఆయన భార్యగా చేసి ఆకట్టుకుంది.
స్నేహ తమిళ్ లోనూ చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. విజయ్, అజిత్, కమల్, సూర్య, ప్రశాంత్, ధనుష్ లతో నటించింది. ముఖ్యంగా విజయ్, అజిత్ లతో ఆమె సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరో ఎవరు అనేదానికి సమాధానం చెప్పారు. స్నేహ మాట్లాడుతూ.. తనకు అజిత్ అంటే ఇష్టమని అన్నారు. ఇక స్నేహ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. నటనకు ప్రదాన్యత పాత్రలను ఎంచుకుంటున్నారు స్నేహ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.