కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరు. అంతేకాదు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అయితే ఇటీవల సూర్య, జ్యోతికకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దానికి కంగువా ప్రమోషన్లో క్లారిటీ ఇచ్చాడు సూర్య. ‘కంగువా’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొన్ని వారాలుగా హీరో సూర్య సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల రెండు మూడు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సూర్య మరోసారి ముంబై వెళ్లారు. అన్ని భాషల్లోనూ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్న సూర్య ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య జ్యోతిక గురించి స్పందించారు.
గత కొన్నాళ్లుగా జ్యోతిక ముంబైలో ఉంటున్నారు. మొదట్లో ఇద్దరి మధ్య విభేదాల కారణంగా జ్యోతిక ముంబై షిప్ట్ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని జ్యోతిక, సూర్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.తాజాగా మరోసారి ఆ విషయమై సూర్య ఫుల్ క్లారిటీతో సమాధానం ఇచ్చారు.18 ఏళ్ల వయసులోనే జ్యోతిక చెన్నై వచ్చేసింది. పెళ్లి తర్వాత తను పూర్తిగా ఫ్యామిలీకే అంకితమైంది. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తన స్నేహితులను, కెరీర్ ను కూడా కాదనుకుంది. మా ఫ్యామిలీ కోసం తన జీవన శైలి పూర్తిగా మార్చుకుంది. కోవిడ్ తర్వాత, ఇక మార్పు అవసరమని నాకు అనిపించింది” అని సూర్య తెలిపారు.
27 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులతో పూర్తిగా ఉండటంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. పురుషులకు ఏం కావాలో.. మహిళలకు కూడా అది అవసరం. నాకు ఇది ఆలస్యంగా అర్థమైంది. ఆమెకు వెకేషన్స్, ఫ్రెండ్స్, ఆర్థిక స్వాతంత్య్రం కావాలి. ఆమెకు గౌరవం, జిమ్ టైమ్ కూడా కావాలి. తల్లిదండ్రుల నుంచి ఆమె సమయాన్ని, ఆమె ఒకప్పుడు ఇష్టపడిన లైఫ్‌స్టైల్‌ను ఎందుకు దూరం చేయాలని నేను అనుకున్నా. మనం ఎప్పుడు మారతాం? నా గురించి ఎప్పుడూ ఎందుకు? మేం ముంబైకి మారడం వెనుక ఈ ఆలోచనలు ఉన్నాయి” అని కంగువ హీరో సూర్య చెప్పారు.పిల్లలు సైతం ముంబైలోని అత్యున్నత స్కూల్ లో చదువుతున్నారు. ముంబైలో ఉన్నా వారి విషయంలో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని సూర్య అన్నారు. చెన్నై, ముంబై లను బ్యాలన్స్ చేస్తూ తాను వర్క్ లో బిజీగా ఉంటున్నాను. నెలలో కనీసం పది రోజులు ముంబైలో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటానని అన్నారు. 20 రోజుల్లో ఎక్కువ గంటలు షూటింగ్ లో పాల్గొంటానని, ఆ పది రోజులు మాత్రం పూర్తిగా ముంబైలో పిల్లలతో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తానని సూర్య పేర్కొన్నారు.