టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరో కెరీర్ లో కూడా హిట్, ఫ్లాప్ లు ఉంటాయి. కంటెంట్ లేని సినిమాలని ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. వందల కోట్లు పెట్టినా.. కద లేకపోతే కనికరించడం లేదు. స్టార్ డమ్ కాలంపోయి.. మళ్లీ కథకే పెద్ద పీట వేసే రోజులు మొదలయ్యాయి అనిపిస్తుంది. అయితే ఒక్కో సినిమా ప్లాప్ కావడానికి ఒక్కో కారణం ఉంది. కధలేని సినిమాలు కొన్ని ఫ్లాప్ అయితే, టైటిల్స్ వల్ల ఫెయిల్ అవుతున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అలా సినిమాకి, ఆ సినిమా పేరుకు సంబంధం లేకుండా వచ్చిన సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.. సారొచ్చారు.. పరుశురాం దర్శకత్వంలో రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో 2012 డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ టైటిల్ కి, సినిమాకి పొంతన ఉండదనే చెప్పుకోవాలి.
బ్రూస్ లీ.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2015 లో వచ్చిన ఈ చిత్రానికి సైతం కథకు, టైటిల్ కు పొంతన ఉండదు. ఐస్ క్రీమ్.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నవదీప్ హీరోగా, తేజస్వి మడివాడ తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాకు, టైటిల్ కు కూడా ఏమాత్రం సంబంధం ఉండదు. ఆరెంజ్.. భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా 2010 నవంబర్ 26 విడుదలైన ఈ సినిమాకి, టైటిల్ కి ఏ మాత్రం సంబంధం ఉండదు.
ఖలేజా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, అనుష్క హీరోయిన్ గా 2010 సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రానికి, టైటిల్ కి ఏ మాత్రం సంబంధం ఉండదు. అలాగే నాగశౌర్య హిట్ సినిమాలలో చలో, ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా కొన్ని సినిమాలకు, టైటిల్ కు సంబంధం లేదనే సంగతి తెలిసిందే.