Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

సినిమా నేపథ్యం ఉన్నా.. హీరోయిన్స్ గా రాణించలేకపోతున్న సెలబ్రిటీ డాటర్స్.. కారణం అదేనా..?

Admin by Admin
April 30, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి స్టార్లుగా మారిన నటీనటులు చాలామంది ఉన్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా ఎవరికి వారు సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినంత మాత్రాన ప్రతి యాక్టర్ సక్సెస్ అవ్వాలి అని రూలేమీ లేదు. కానీ అలా కొంతమంది నటులకు చెందిన కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ గా రాణించలేకపోయారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. అక్కినేని కుటుంబం వారసురాలిగా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సుప్రియ యార్లగడ్డ. మొదటి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసింది. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నాగార్జున మేనకోడలైన సుప్రియ కి ఈ చిత్రం తర్వాత అనుకున్నంత స్థాయిలో హీరోయిన్ గా ఛాన్సులు రాలేదు.

సూపర్ స్టార్ కృష్ణ రెండవ కూతురు, మహేష్ బాబుకి చిన్న అక్క మంజుల కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అప్పట్లో బాలకృష్ణ తో ఓ సినిమా కూడా ఓకే అయింది. కానీ కృష్ణ కూతురు కాబట్టి ఆమెని వేరే వాళ్ళ పక్కన ఊహించుకోలేమని ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేసింది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రెండవ కూతురే అక్షర హాసన్. ఈమె ధనుష్ సరసన షమితాబ్ అనే సినిమాలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలలో నటించిన హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

these actress are failed in industry despite coming from movie back ground

మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ తనని హీరోయిన్ గా అంగీకరించలేకపోయారు ప్రేక్షకులు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా పూర్తిస్థాయిలో హీరోయిన్ గా రాణించలేకపోయింది. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య విశాల్ హీరోగా చేసిన ధీరుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఈమెకి ఛాన్సులు ఎక్కువగా రాలేదు.

Tags: Actress
Previous Post

బాలయ్య కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన పాన్ ఇండియన్ లెవెల్ సినిమాలు !

Next Post

నేనొక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.. నా జీతంతో నేను హ్యాప్పీగానే ఉంటున్నా..

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!