టాలీవుడ్ చరిత్రలో వంద రోజులు ఆడిన సినిమాలు కోకోల్లోలు ఉన్నాయి. ఒక సినిమా థియేటర్లో ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత ఎక్కువ కలెక్షన్లు సాధించుకోవడంతోపాటు సినిమాకు భారీ లాభాలు వచ్చి సూపర్ హిట్ గా నిలుస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎంత గొప్ప సినిమా అయినా థియేటర్లలో రెండు వారాలు ఆడడమే గగనం. ఇప్పుడు అంతా మూడు, నాలుగు వారాలు ఆడితే గొప్ప అన్నట్టుగా పరిస్థితి వచ్చేసింది. అయితె గతంలో ఎక్కువ సెంటర్స్ లో ఏకంగా 175 రోజులు ఆడిన కొన్ని సినిమాలు ఉన్నాయి. అందులో టాప్ 10 సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం రండి.
1) సమరసింహారెడ్డి.. బి.గోపాల్ – నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన మూడవ సినిమా సమరసింహారెడ్డి. ఈ చిత్రం 29 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 2) సింహాద్రి.. ఎస్ఎస్ రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సింహాద్రి. ఈ చిత్రం 55 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. షిఫ్టులు తీసేస్తే 52 కేంద్రాలు. 3) ప్రేమాభిషేకం.. దాసరి నారాయణరావు – అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రేమ కథ సినిమా ప్రేమాభిషేకం. ఈ మూవీ 19 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 4) నరసింహనాయుడు.. బి గోపాల్ – బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 17 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.
5) కలిసుందాం రా.. ఉదయ్ శంకర్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో 2000 సంవత్సరంలో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం 14 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 6) పోకిరి.. పూరి జగన్నాథ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో 2006లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 63 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 7) ఇంద్ర.. బి గోపాల్ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ 35 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 8) పెళ్లి సందడి.. కే రాఘవేంద్రరావు – శ్రీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 27 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 9) లవకుశ.. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా 1963 లో విడుదలైన సినిమా లవకుశ. ఈ మూవీ 13 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 10) నువ్వే కావాలి.. కే విజయభాస్కర్ – లవర్ బాయ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 25 సెంటర్లలో 175 రోజులు ఆడింది.