టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో, టైటిల్ అంతకంటే ముఖ్యం. సినిమా టైటిల్ కోసం దర్శకనిర్మాతలు తల బద్దలు కొట్టుకుంటారు. టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వేయరు. అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు. గతంలో వెండితెరపై సందడి చేసిన టైటిల్, ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడేసి సార్లు కూడా రిపీట్ చేస్తున్నారు. గతంలో ఒకే టైటిల్ తో రెండు సినిమాలు చాలానే తెరకెక్కాయి. కానీ ఇప్పుడు ఒకే టైటిల్ తో మూడు సినిమాలు వస్తున్నాయి. అలా మూడు సినిమాలకు ఒకే టైటిల్ ఉన్న లిస్టు చూస్తే, ఇదేమిటి అబ్బా ఇలా వాడేస్తున్నారు అనుకుంటారు.
ప్రస్తుతం తెలుగులో పాత సినిమా టైటిల్ ట్రెండ్ నడుస్తుంది. ఈ తరుణంలోని గోపీచంద్ మూవీ రామ బాణం టైటిల్ తో గతంలో తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా టైటిల్ గోపీచంద్ చేశారు. విజయ్ వారసుడు మూవీ కూడా ఇవివీ సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున హీరోగా నటించిన వారసుడు టైటిల్ కావడం విశేషం. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. మరి ఆ బాటలో విజయ్ వారసుడు తెలుగులో విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఖైదీ.. హీరోగా చిరంజీవి కెరీర్ ను చేంజ్ చేసిన మూవీ. ఖైదీ నెం 150 అనే సినిమాను కూడా ఆయనే చేశారు. ముచ్చటగా మూడోసారి ఇదే టైటిల్ తో కార్తీ హీరోగా నటించిన, ఖైదీ తెలుగు పేక్షకుల్ని అలరించింది. 1986 లో చిరంజీవి హీరోగా రాక్షసుడు విడుదలైంది. 2015లో సూర్య నటించిన తమిళ చిత్రం ఇదే పేరుతో తెలుగుపేక్షకుల్ని అలరించింది. ముచ్చటగా మూడోసారి ఈ పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ చేశాడు.
1953 లో దేవదాసు మూవీ విడుదలై సంచలనం సృష్టించింది. దేవదాసు నే అంటూ 2016లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్. ఇవి రెండు ప్రేమ కథలైతే ఇదే పేరుతో నవ్వులు పంచారు నాగార్జున, నాని. ఒకరు దేవా, మరొకరు దాస్ గా దేవదాస్ లో సందడి చేశారు. ఆ తరంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీమంతుడు సినిమా, ఈ తరంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు వచ్చింది. అప్పటిలో విక్టరీ వెంకటేష్, ఈ తరంలో నితిన్ శ్రీనివాస కళ్యాణం అనే ఒకే పేరు ఉన్న చిత్రాలకు నటించారు. మహర్షి పేరుతో తెరకెక్కిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. సెన్స్ షేషనల్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి చిత్రం ప్రేక్షకులను అలరించింది.
గణేష్ సినిమా కూడా రెండుసార్లు రిపీట్ అయింది. విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ స్టార్ రామ్… హీరోలుగా రెండుసార్లు గణేష్ సినిమా వచ్చింది. అలాగే తొలిప్రేమ సినిమా కూడా రెండుసార్లు రిపీట్ అయింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ చేయడం విశేషం. లెజెండ్ నందమూరి బాలయ్య, కార్తీ శివకుమార్ విడివిడిగా సుల్తాన్ సినిమాను చేశారు.