తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన సినిమాల నుంచి మొదలు ఫ్యాన్స్ వరకు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పవర్ స్టార్ గా మారారు. ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సినిమాలు రాజకీయంగా దూసుకుపోతున్న ఈ హీరో తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఇప్పటికే ఇద్దరితో విడిపోయారు. ఎంతో పేరు తెచ్చుకున్న ఈయన చాలామందికి రోల్ మోడల్ గా ఉండవలసింది కానీ ఈ విధంగా పెళ్లిళ్లు చేసుకొని ప్రజలకు ఎలాంటి సందేశమిస్తారని కొంతమంది విమర్శిస్తూనే ఉంటారు.ఈ విమర్శలను తిప్పికొడుతూ పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి అనేది నా పర్సనల్ వ్యవహారం అని వారి విమర్శలకు ప్రతి విమర్శలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.. అయితే పెళ్లిల విషయమై జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టేశారు..
పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయితో కేవలం నెల రోజులు మాత్రమే కలిసి ఉన్నారని, ఆ తర్వాత అమ్మాయి అతన్ని ఇల్లరికం రమ్మని కోరిందని, ఆ ప్రతిపాదన ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి విడిపోయారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కు తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ.. నేను ఎవరి ఇంటికో ఇల్లరికం వెళ్లడం అనే విషయం నన్ను చాలా బాధించిందని, తనకంటూ సొంత వ్యక్తిత్వం ఉందని ఇల్లరికం అల్లుడిగా వెళ్లాల్సిన అవసరం నాకు ఏమొచ్చిందని పవన్ కళ్యాణ్ పలుమార్లు అన్నారట.. 10 సంవత్సరాలు ఆమెకు దూరంగా ఉన్న ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా విడాకులు తీసుకొని విడిపోయారని శ్రీధర్ వెల్లడించారు.