Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Admin by Admin
May 8, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా నిద్రపోవడం కూడా అంతే అవసరం. రోజులో కనీసం తగినంత సమయం పాటు నిద్రించకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మనలో అధిక శాతం మంది వివిధ రకాలుగా నిద్రిస్తారు. కొందరు పక్కకు తిరిగి పడుకుంటే మరికొందరు వెల్లకిలా, ఇంకొందరు బోర్లా తిరిగి పడుకుంటారు. ఈ క్రమంలో అసలు ఏ విధంగా నిద్రిస్తే మంచిదో, దాని వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపుగా భార్యాభర్తలే ఎడ‌మొఖం పెడ‌మొఖంగా నిద్రిస్తారు. ఒకరి దిక్కు మరొకరు చూడకుండా ఎడమొఖంగా పడుకుంటారు. దాదాపు 55 శాతం వరకు జంటలు ఈ విధంగానే నిద్రిస్తారట.

అయితే ఇలా వారు నిద్రించడాన్ని బట్టి చూస్తే ఆ దంపతులు రిలేషన్‌షిప్ సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలి. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదనో, మరే ఇతర కారణం వల్లో వారిద్దరి మధ్య సంబంధాలు అంతగా బాగా లేవని గుర్తించాలి. జీవిత భాగస్వాములిద్దరూ ఒకరికి ఎదురుగా మరొకరు నిద్రిస్తే ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉందని అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలోనే వారు తమ ప్రేమను పంచుకునేందుకు ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. ఒకరినొకరు పెనవేసుకున్నట్టు నిద్రించే స్పూనింగ్ పద్ధతిలో దంపతులకు నొప్పులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ తరహా విధానాన్ని పాటించకపోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ విధానంలో దంపతులిద్దరూ ఒత్తిడికి కూడా గురవుతారట.

what happens if sleep by hugging a pillow

దంపతులిరువురూ చెరో బెడ్ అంచుకు వచ్చి ఇద్దరూ ఎడమొఖంగా నిద్రిస్తే చాలా మంచిదట. ఇలా నిద్రించే జంటల్లో 90 శాతం జంటలు సంతోషంగా ఉంటారట. చేతులను వెనకగా పెట్టి నిద్రిస్తే మంచిదేనట. దీని వల్ల ముఖంపై ముడతలు, గురక, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయట. అయితే దీని వల్ల భుజాలపై ఎక్కువగా ఒత్తిడి పడుతుందట. దీన్ని తట్టుకోవాలంటే కింద కొన్ని మెత్తలను పెట్టుకుంటే సరిపోతుందట. దిండును కావలించుకుని పడుకుంటే కీళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుందట. ఇలా పడుకోవడం కూడా మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. తల్లి కడుపులో బిడ్డ ఉన్న మాదిరిగా నిద్రించడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల మెడ, వెన్నెముక సమస్యలు వస్తాయట. అదేవిధంగా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందట.

బోర్లా పడుకోవడం కూడా మంచిది కాదట. దీంతో చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుందట. దీని వల్ల శ్వాస సమస్యలు కూడా వస్తాయట. బెడ్‌పై ఏదైనా ఒక పక్కకు తిరిగి పడుకుంటే వెన్నెముక సమస్యలు రావట. అయితే దీని వల్ల చర్మంపై ముడతలు వస్తాయట. కానీ ఈ పద్ధతిలో ఎక్కువ సేపు మాత్రం నిద్రించకూడదట. అన్ని భంగిమల్లోకెల్లా వెల్లకిలా తిరిగి పడుకోవడం ఉత్తమమైందట. దీని వల్ల మెడ, వెన్నెముకలకు చెందిన సమస్యలు రావట. దాదాపు అందరూ ఈ విధానంలో ఎక్కువ సేపు నిద్రించవచ్చట.

Tags: pillowsleep
Previous Post

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

Related Posts

చిట్కాలు

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

May 8, 2025
mythology

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు… ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

May 8, 2025
technology

ఇన్వర్టర్ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దానిని ఎప్పుడు మార్చాలి?

May 8, 2025
inspiration

న‌లంద విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌ను అభ్య‌సించిన చైనా యాత్రికుడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

May 8, 2025
Off Beat

ఆడ‌పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రులు త‌ప్ప‌క ఇది చ‌ద‌వాల్సిందే..!

May 8, 2025
politics

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

May 8, 2025

POPULAR POSTS

న‌ట్స్ & సీడ్స్

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

by Admin
July 23, 2024

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
పోష‌కాహారం

Children Height Increase : మీ పిల్లలు బాగా ఎత్తుగా పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

by Admin
January 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by D
November 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Maredu Leaves : ఈ ఆకును ప‌ర్సులో పెట్టుకుంటే వ‌ద్ద‌న్నా డ‌బ్బులు వ‌స్తాయి..!

by D
June 20, 2022

...

Read more
పండ్లు

Watermelon : పుచ్చ‌కాయ‌ల‌ను ఈ సీజ‌న్‌లోనూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by D
July 18, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.