Uday Kiran : దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. ఆయన చనిపోవడానికి కారణం ఏంటి..?, ఆయన ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇలా చాలా వార్తలు మనకి సోషల్ మీడియాలో తరచూ కనపడుతూనే ఉంటాయి. ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పుకున్నా, తక్కువే. సినీ ఇండస్ట్రీలో, కొంతకాలంలోనే స్టార్ హీరోగా మారిపోయి, ఇండస్ట్రీని షేక్ చేసేసాడు ఉదయ్ కిరణ్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలని కూడా ఉదయ్ కిరణ్ సినిమాలు భయపెట్టేవట.
ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్ ఉంటే, స్టార్ హీరోలు సినిమాని పోస్ట్ పోన్ చేసుకునే వారట. చేతిలో డబ్బులు లేక, సినిమా అవకాశాలు లేక, డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, ఇక మరణమే మేలు అనుకుని, ఉదయ్ కిరణ్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయ్ కిరణ్ గతంలో చేసిన పొరపాట్లు వల్లే, ఆయన లైఫ్ అలా మారిపోయిందని, ఉదయ్ కిరణ్ స్నేహితులు చెప్తూ ఉంటారు కూడా.
ఉదయ్ కిరణ్ మంచిగా సినిమాలు చేసుకున్నప్పుడు, కొన్ని చెడు సావాసాలు ద్వారా ఆయన రూట్ మళ్లిందట. అప్పుడు ఆయన కెరియర్ కాస్త డిజాస్టర్ గా మారిపోయింది. ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనిత ప్రేమించుకున్నారు కూడా. ఉదయ్ కిరణ్ కి ప్రపోజ్ కూడా చేసింది. ఒకవేళ అప్పుడు వాళ్ళ లవ్ సక్సెస్ అయ్యి, పెళ్లి చేసుకొని ఉంటే ఎంతో హ్యాపీగా వుండేవాళ్ళు.
ఉదయ్ కిరణ్ మన ముందు ఉండేవారు. ఇలా అర్దాంతరంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. అనిత ఉదయ్ కిరణ్ కలిసి నువ్వు నేను సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికి కూడా టీవీలో వచ్చినప్పుడల్లా చాలామంది మిస్ అవ్వకుండా ఈ మూవీ ని చూస్తుంటారు.