తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతము ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుంది. ఇక అందరి హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలు అయినా అందరికంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. హిట్లు ఫ్లాప్ లు సంబంధం లేకుండా సినిమాల్లో, రాజకీయాల్లో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్..
అలాంటి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఒక సినిమాను కాపీ కొట్టి మరో హీరో సినిమా చేశాడనే విషయం చాలామందికి తెలియదు.. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బాలు సినిమా వచ్చిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఈ సినిమా స్టోరీనే మరో స్టార్ హీరో కాపీ చేసి హిట్ అందుకున్నారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రవితేజ హీరోగా బలుపు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రానికి కథ అందించిన దర్శకుడు బాబి. పవన్ కళ్యాణ్ బాలు సినిమాను పోలి ఉంటుందని చాలామంది అంటున్నారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ చనిపోతుంది. కానీ ఇందులో బాలు సినిమా హిట్ కాలేదు కానీ, బలుపు సినిమా మాత్రం సూపర్ హిట్ అందుకుంది.