ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని నిమిషాల‌ పాటు ర‌న్నింగ్ చేయాలో తెలుసా ?

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ స్థోమ‌త‌, సౌక‌ర్యానికి అనుగుణంగా రోజూ వ్యాయామం చేస్తుంటారు. అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా సుల‌భంగా చేసే వ్యాయామాల్లో ర‌న్నింగ్ ఒక‌టి. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని నిమిషాల‌ పాటు ర‌న్నింగ్ చేయాలో తెలుసా ?

రోజూ ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక ర‌కాలుగా ఆరోగ్యంగా ఉంటాము. కండ‌రాలు దృఢంగా మారుతాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌, బీపీ, షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

రోజూ ర‌న్నింగ్ చేస్తే శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌న్నీ శ‌రీరానికి అందుతాయి. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

అయితే ర‌న్నింగ్ ఆరోగ్య‌క‌రమే అయిన‌ప్ప‌టికీ రోజూ ఎన్ని నిమిషాల పాటు ర‌న్నింగ్ చేయాలా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌శ్న‌కు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారంటే..

ఆరంభంలో అయితే 15 నిమిషాల‌తో ర‌న్నింగ్ మొద‌లు పెట్ట‌వ‌చ్చు. అందులో 5 నిమిషాలు వార్మ‌ప్ చేయాలి. క్ర‌మంగా ఆ స‌మ‌యాన్ని 30 నిమిషాల‌కు పెంచాలి. అంటే.. 30 నిమిషాలు ర‌న్నింగ్ + 5 నిమిషాల వార్మ‌ప్.. మొత్తం క‌లిపి 35 నిమిషాలు అవుతాయి. రోజూ 35 నిమిషాల పాటు ఈ విధంగా ర‌న్నింగ్ చేయ‌వ‌చ్చు.

అయితే శ‌క్తి ఉంది, ఇంకా చేస్తాం.. అనుకునే వారు ఇంకో 30 నిమిషాల పాటు అద‌నంగా ర‌న్నింగ్ చేయ‌వ‌చ్చు. కానీ ఎక్కువ‌గా ర‌న్నింగ్ చేసినా దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయి. తీవ్ర‌మైన నొప్పులు వ‌స్తాయి. క‌నుక ర‌న్నింగ్ ను త‌గినన్ని నిమిషాల పాటు మాత్ర‌మే చేయాలి. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు ర‌న్నింగ్ చేస్తే చాల‌ని, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. బాగా శ‌క్తి ఉన్న‌వారు అద‌నంగా ఇంకో 30 నిమిషాల పాటు.. అంటే మొత్తం 60 నిమిషాల పాటు ర‌న్నింగ్ చేయ‌వ‌చ్చు. కానీ అలా చేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతుంటే వెంట‌నే అలా చేయ‌డం మానేయాలి. కేవ‌లం 30 నిమిషాల పాటు మాత్ర‌మే ర‌న్నింగ్ చేయాల్సి ఉంటుంది.

Share
Admin

Recent Posts