నిద్రలేమి సమస్య నుంచి బయట పడేందుకు ఈ సూచనలను పాటించండి..!

నిద్రలేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే కింద తెలిపిన సూచనలను పాటిస్తే దాంతో ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. నిద్ర కూడా బాగా పడుతుంది.

నిద్రలేమి సమస్య నుంచి బయట పడేందుకు ఈ సూచనలను పాటించండి..!

1. రోజూ ఒకే సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఈ విధానం బాగా అలవాటు అవుతుంది. ఆ సమయం కాగానే నిద్ర వస్తుంది. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.

2. రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది.

3. రాత్రి నిద్రకు ముందు ఆల్కహాల్‌ను సేవించడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. కనుక మద్యం సేవించడం మానేయాలి. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.

4. మధ్యాహ్నం ఎక్కువగా నిద్రించే వారికి కూడా రాత్రి పూట నిద్ర పట్టదు. కనుక మధ్యాహ్నం నిద్రను మానేయాలి.

5. రోజూ వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయడం వల్ల శరీరం అలసినట్లు అవుతుంది. రాత్రి నిద్ర చక్కగా పడుతుంది.

6. రాత్రి నిద్రకు ముందు ఎలాంటి ఆహారాలను తీసుకోరాదు. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ తినరాదు. అంతలా తీసుకోవాలనిపిస్తే పాలలో పసుపు లేదా తేనె కలిపి తాగితే మంచిది. దీంతో నిద్ర బాగా పడుతుంది.

7. రాత్రి కొందరు టీ, కాఫీ, గ్రీన్‌ టీ తాగే అలవాటు ఉంటుంది. దీన్ని మానుకోవాలి. ఎందుకంటే వాటిల్లో ఉండే కెఫీన్‌ నిద్రకు భంగం కలిగిస్తుంది. కనుక రాత్రి నిద్ర బాగా పట్టాలంటే వాటిని తాగరాదు.

8. రాత్రి నిద్రకు ముందు పుస్తకాలను చదవడం వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడాలంటే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

Share
Admin

Recent Posts