మనలో చాలా మందికి చ్యవనప్రాష్ లేహ్యం గురించి తెలిసే ఉంటుంది. డాబర్ వంటి కంపెనీలు ఈ లేహ్యాన్ని తయారు చేసి మనకు అందిస్తున్నాయి. ఇందులో 50 వరకు ఔషధ విలువలు కలిగిన మూలికలు ఉంటాయి. అందువల్ల చ్యవనప్రాష్ లేహ్యం మన ఆరోగ్యాన్ని కాపాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
చ్యవనప్రాష్ లేహ్యాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు వైద్యుల సూచన మేరకు వాడుకోవాలి. ఇక పిల్లలకు కాకుండా పెద్దలు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. తరచూ చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే వారు నిత్యం చ్యవనప్రాష్ లేహ్యం తింటే ఆయా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మధుమేహం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా షుగర్ ఫ్రీ చ్యవనప్రాష్ లేహ్యం అందుబాటులో ఉంది. దాన్ని నిత్యం తీసుకోవచ్చు.
చ్యవనప్రాష్ లేహ్యాన్ని నిత్యం ఉదయం తీసుకోవాల్సి ఉంటుంది. 2 కుంకుడ గింజలంత మోతాదులో దీన్ని తినవచ్చు. తిన్న తరువాత పాలు తాగాల్సి ఉంటుంది. దీంతో శరీరానికి పూర్తి రక్షణ లభిస్తుంది. నిత్యం మన శరీరంపై అనేక వ్యాధికారక సూక్ష్మ క్రిములు దాడి చేస్తుంటాయి. వాటి నుంచి కూడా మనకు చ్యవనప్రాష్ లేహ్యం రక్షణను అందిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365