Couples : భార్యా భర్తల దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే.. భర్తలు పాటించాల్సిన సూచనలు..

Couples : భార్యా భర్తలు అన్నాక గొడవలు వస్తుండడం సహజం. చిన్నపాటి విషయాలకే గొడవలు పడుతుంటారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవాలే గానీ ఎలాంటి గొడవలు రావు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండవచ్చు. అయితే ఈవిషయంలో భార్య కన్నా భర్త పాటించాల్సిన సూచనలు ఎక్కువగా ఉంటాయి. అవేమిటంటే..

Couples : భార్యా భర్తల దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే.. భర్తలు పాటించాల్సిన సూచనలు..

ఇతరుల ఎదుట భార్యను గౌరవిస్తూ మాట్లాడాలి. ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు సావధానంగా వినండి. ఆమె చూసే టీవీ చానల్‌ మార్చకండి. ఫోన్లు, ట్యాబ్‌లు కంప్యూటర్‌లు ఉన్నాయి కనుక వాటిల్లో మీకు నచ్చినవి చూడండి. వంట పని, ఇంటి పనిలో సహాయం చేయండి. కూర నచ్చకపోతే నిందించకండి. ఎవరైనా సరే రోజూ బాగా వండిపెట్టలేరు.. అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

ఆమె పుట్టిన రోజు నాడు ఏదైనా బహుమతి ఇవ్వండి. చిన్నదైనా ఫర్వాలేదు, ప్రేమగా ఇవ్వండి. రోజూ కాస్తంత సమయం పాటు మనస్ఫూర్తిగా, ప్రేమగా మాట్లాడుకొండి. రాత్రి ఆలస్యం అయ్యేట్లు ఉంటే ముందుగానే చెప్పండి. ఉదయం మీరు ముందుగా లేస్తే కాఫీ లేదా టీ కలిపి ఇవ్వండి.

ఎప్పుడైనా ఒకసారి బయట సరదాగా తిరిగి రండి. రోజూ ఆమెతో కలసి భోజనం చేసేందుకు ప్రయత్నించండి. తప్పు చేస్తే భార్యకు సారీ చెప్పండి. అందులో నామోషీ ఫీల్ కావాల్సిన పనిలేదు.

ఇలా కొన్ని సూచనలను భర్తలు పాటిస్తే చాలా మంది భార్యలు సంతోషిస్తారు. భర్తలను ప్రేమగా చూసుకుంటారు. అలాంటి వారి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది.

Admin

Recent Posts