చలికాలంలో మనకు నారింజ పండ్లు ఎక్కువగా లభిస్తుంటాయి. నారింజ పండ్లను మన దేశంలో చలికాలంలో ఎక్కువగా తింటుంటారు. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. నారింజ పండ్లలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫోలేట్, విటమిన్ సి లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ను ఫైటో కెమికల్స్ అంటారు. అందువల్ల నారింజ పండ్లను తినడం ద్వారా డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
అయితే గుమ్మడికాయలు, బెర్రీలు, మఖనాలలాగే నారింజ పండ్లు కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. అలాగే దీర్ఘకాలంలో డయాబెటిస్ లక్షణాలు తీవ్రతరం కాకుండా చూస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆరెంజ్ పండ్లను తినవచ్చా ? సైంటిస్టులు ఏం చెబుతున్నారు ? అంటే…
నారింజ పండ్లలో ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కదా.. అయితే ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల ఫైటో కెమికల్స్ ఉన్న పండ్లు, కూరగాయలను తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. కాబట్టి ఫైటో కెమికల్స్ ఉండే నారింజ పండ్లను డయాబెటిస్ ఉన్నవారు నిర్భయంగా తినవచ్చు. అయితే జ్యూస్ చేసుకుని తాగేవారు అందులో చక్కెర కలపకూడదు. అందుకు బదులుగా నిమ్మరసం, తేనె, అల్లంరసం, పుదీనా రసం కలుపుకుని తాగవచ్చు.
ఇక రోజులో ఎప్పుడైనా నారింజ పండ్లను తినవచ్చు. లేదా వాటి జ్యూస్ తాగవచ్చు. వాటిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. డయాబెటిస్ ను అదుపు చేస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు నారింజ పండ్లు లేదా వాటి జ్యూస్‌ను ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.