Mens Problems : ప్రస్తుత తరుణంలో చాలా మంది జంటలు సంతానం లేక మనస్థాపం చెందుతున్నారు. అయితే సంతాన లోపానికి స్త్రీలు ఎంత కారణం అవుతున్నారో.. పురుషులు కూడా అంతే కారణం అవుతున్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఉండే పలు సమస్యల కారణంగా దంపతులకు సంతానం కలగడం లేదు. అయితే ముఖ్యంగా పురుషులు తమ రోజువారీ ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల తమకు కలిగే సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో శృంగార సామర్థ్యం పెరగడమే కాదు, ఆ సమస్యలన్నీ తగ్గుతాయి. సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
బాదంపప్పు, వాల్ నట్స్‌ను పురుషులు రోజూ తినాలి. వీటిల్లో విటమిన్ ఇ, మెగ్నిషియం, మాంగనీస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల పురుషుల్లో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. జననావయవాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో ఆ అవయవాలు పటిష్టంగా మారుతాయి. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. అంగస్తంభన సమస్య తొలగిపోతుంది. వీర్యం బాగా తయారవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
పురుషులు రోజుకు ఒక కోడిగుడ్డును ఆహారంలో చేర్చుకోవాలి. కోడిగుడ్లలో విటమిన్లు బి6, బి5 సమృద్ధిగా ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. శృంగారంపై కోరికను పెంచుతాయి. కోడిగుడ్లను రోజూ తినడం వల్ల పురుషుల్లో ఉండే ఎలాంటి సమస్యలైనా సరే తగ్గిపోతాయి. శరీరంలో శక్తి స్థాయిలను, శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. దీని వల్ల శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పురుషులు తమ రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను తీసుకోవాలి. ఓట్స్ వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. 8 వారాల పాటు రోజూ ఓట్స్‌ను తీసుకున్న పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు వీర్యం కూడా ఎక్కువగా ఉత్పత్తి అయిందని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక ఓట్స్‌ను తీసుకుంటే పురుషులు తమకు ఉండే సమస్యల నుంచి బయట పడవచ్చు. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. వీర్యం కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
రోజూ ఒక దానిమ్మ పండును తినడం లేదా ఒక గ్లాస్ దానిమ్మ పండు రసాన్ని తాగడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయని సైంటిస్టులు తేల్చారు. దీంతోపాటు మగవారిలో కండరాలు దృఢంగా మారుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. కనుక దానిమ్మను రోజూ తీసుకుంటే పురుషులు తమ సమస్యల నుంచి బయట పడవచ్చు.