Immunity : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది. ఎన్నో కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. ఈ క్రమంలోనే పలు దేశాల్లో కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకు వస్తున్నాయి. కరోనా మళ్లీ కొత్త రూపంలో దాడి చేస్తోంది. దీంతో మన దేశంలో కూడా కోవిడ్ మూడో వేవ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాలను తీసుకోవడం తప్పనిసరి అయింది. అయితే కింద తెలిపిన పదార్థాలను కూడా రోజూ తీసుకుంటే దాంతో రోగ నిరోధక శక్తిని మరింతగా పెంచుకోవచ్చు. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. మరి కోవిడ్ రాకుండా ఉండాలంటే రోజూ తీసుకోవాల్సిన ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఉసిరికాయలు మనకు ఈ సీజన్‌లో విరివిగా లభిస్తాయి. రోజుకు చిన్న ఉసిరి కాయలు అయితే నాలుగైదు, పెద్దవి అయితే 2, 3 తినాలి. దీంతో వాటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఉసిరిక పొడి, జ్యూస్ కూడా మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వాటిని కూడా రోజూ తీసుకోవచ్చు. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
2. మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మునగాకుల రసాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొందరు మునగాకుల కూర కూడా తింటారు. ఈవిధంగా వాటిని తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
3. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ పొడిని కలుపుకుని తాగితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
4. చిలగడదుంపలు కూడా మనకు ఈ సీజన్ లో బాగానే లభిస్తాయి. వాటిని తీసుకుంటున్నా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. గుమ్మడికాయలను కూరగా చేసుకుని తినవచ్చు. వాటి విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తినాలి. ఇవి మనకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
ఇవే కాకుండా వాల్ నట్స్, బాదంపప్పు, పిస్తా, నారింజ, దానిమ్మ పండ్లు.. వంటి విటమిన్ సి, ఇలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.