రివర్స్ డైటింగ్ అనేది ప్రస్తుతం లేటెస్ట్ డైట్ ట్రెండ్‌గా మారింది. రోజూ వ్యాయామం చేసేవారు, జిమ్ చేసేవారు, బాడీ బిల్డర్లు, బాక్సింగ్ చేసేవారు దీన్ని పాటిస్తుంటారు. సైంటిస్టులు ఈ డైట్‌పై చేసిన అధ్యయనాల ప్రకారం.. ఈ డైట్‌ను సరిగ్గా పాటిస్తే అధిక బరువును తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.
రివర్స్ డైటింగ్ చేయడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. రివర్స్ డైటింగ్ అంటే.. ఒక డైట్ ను పాటించాక ఇంకో డైట్‌ను పాటించడం అన్నమాట. ముందుగా కొన్ని నెలల పాటు కఠిన ఆంక్షలతో కూడిన డైట్‌ను పాటిస్తారు. తరువాత మరో డైట్‌ను పాటిస్తారు.
ఇలా ఒక డైట్‌లో కఠిన ఆహార నియమాలు పాటించి వెంటనే ఇంకో డైట్‌ను మొదలు పెట్టడం వల్ల శరీరం మనం తీసుకునే ఆహారం నుంచి తక్కువ క్యాలరీలను మాత్రమే గ్రహిస్తుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. రివర్స్ డైటింగ్ చేయడం వల్ల మెటబాలిజం మెరగు పడడమే కాదు శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఆకలి నియంత్రణలో ఉంటుంది.
అయితే డిప్రెష్, ఆందోళన, ఒత్తిడి, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఇలా రివర్స్ డైట్ పాటించకూడదు. ఆరోగ్యంగా ఉన్నవ్యక్తులు ఈ డైట్‌ను పాటించాల్సిన పనిలేదు. జిమ్ లేదా బాడీ బిల్డింగ్, బాక్సింగ్ వంటివి చేస్తామనుకుంటేనే ఈ డైట్‌ను పాటించాలి. అలాగే అధిక బరువు ఉన్నవారు ఈ డైట్‌ను పాటించవచ్చు.
ప్రస్తుతం మనకు అనేక రకాల డైట్ లు అందుబాటులో ఉన్నాయి. కీటో డైట్ అని, వీగన్ డైట్ అని.. ఇలా ఒక డైట్ తరువాత ఇంకో డైట్‌ను పాటించడాన్నే రివర్స్ డైటింగ్ అంటారు. ఒక్కో డైట్‌లో భాగంగా నిర్దిష్టమైన ఆహారాలను మాత్రమే తినాల్సి ఉంటుంది. ఉదాహరణకు కీటో డైట్‌లో కార్బొహైడ్రేట్లను తక్కువగా, కొవ్వులు, ప్రోటీన్లను ఎక్కువగా తింటారు. అలాగే వీగన్ డైట్‌లో కేవలం శాకాహార పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. ఇక లిక్విడ్ డైట్‌లో కేవలం ద్రవాహారాలను మాత్రమే తీసుకుంటారు. ఇలా ఒక్కో డైట్‌ను కొన్ని రోజుల పాటు పాటిస్తూ మళ్లీ ఇంకో డైట్‌లోకి మారాల్సి ఉంటుంది. అయితే రివర్స్ డైట్‌ను పాటించే ముందు న్యూట్రిషనిస్టుల సలహా తీసుకుంటే మేలు..!