Aloo Curry : ఆలు క‌ర్రీని ఇలా ఒక్క‌సారి వెరైటీగా చేసి చూడండి.. న‌చ్చ‌క‌పోతే అడ‌గండి..!

Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌కమైన చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భం. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా త‌మిళ‌నాడు పెళ్లిళ్ల‌ల్లో చేసే స్పెష‌ల్ ఆలూ కర్రీ త‌యారీ విధానాన్ని.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 3, ల‌వంగాలు -3, సోంపు – ఒక టీ స్పూన్, జీడిప‌ప్పు – 10, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, స‌న్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు – 2, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, బ‌ఠాణీ – అర క‌ప్పు, ఉడికించిన బంగాళాదుంప‌లు – 3, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, మ‌ట‌న్ మ‌సాలా – అర టీ స్పూన్.

Aloo Curry recipe function style very tasty
Aloo Curry

ఆలూ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క‌, యాల‌కులు, ల‌వంగాలు, సోంపు గింజ‌లు వేసి వేయించాలి. త‌రువాత జీడిప‌ప్పు, క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు, బ‌ఠాణీ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు వేగి నూనె పైకి తేలేట‌ప్పుడు ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి వేయించాలి. ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌ను ముక్కలుగా చేసి వేసుకోవాలి.

వీటిని అంతా క‌లిసేలా క‌లిపిన త‌రువాత కొత్తిమీర‌, మ‌ట‌న్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెళ్లిళ్ల స్పెష‌ల్ ఆలూ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం,చపాతీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన ఆలూ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts