Instant Tomato Curry : ట‌మాటా క‌ర్రీని ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Instant Tomato Curry : ట‌మాట క‌ర్రీ.. ట‌మాటాల‌తో చేసే సింఫుల్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ట‌మాట క‌ర్రీని చాలా సుల‌భంగా, రుచిగా, అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బ్యాచిల‌ర్స్ , వంట‌రాని వారు చేసుకోవ‌డానికి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఇన్ స్టాంట్ ట‌మాట క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా, ఇన్ స్టాంట్ గా ట‌మాట క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ ట‌మాట క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, క‌చ్చా ప‌చ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 4 ( మ‌ధ్యస్థంగా ఉన్న‌వి), ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, చికెన్ మ‌సాలా – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక టీ గ్లాస్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Instant Tomato Curry recipe very tasty with rice and chapati
Instant Tomato Curry

ఇన్ స్టాంట్ ట‌మాట క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. త‌రువాత మూత తీసి గంటెతో ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా చేసుకోవాలి.

త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, చికెన్ మ‌సాలా వేసి క‌లపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి క‌లిపి మూత పెట్టాలి. దీనిని చిన్న మంట‌పై మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. కూర చ‌క్క‌గా ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ ట‌మాట క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ట‌మాట క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts