Pachi Mirchi Tomato Pappu : రాయ‌ల‌సీమ స్టైల్‌లో పచ్చి మిర్చి ట‌మాటా ప‌ప్పు.. ఇలా చేస్తే అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

Pachi Mirchi Tomato Pappu : ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు.. ప‌చ్చ‌మిర్చి, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే ఈ విధంగా త‌యారు చేసే ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చిమిర్చి ట‌మాట పప్పును ఎక్కువ‌గా రాయ‌ల‌సీమ వారు త‌యారు చేస్తూ ఉంటారు. రోటీ, చ‌పాతీ, సంగ‌టి వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌ప్పును చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – అర క‌ప్పు, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పులు లేదా రెండు క‌ప్పులు, ప‌చ్చిమిర్చి – 10 లేదా కారానికి త‌గినన్ని, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటాలు – 3( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర‌- కొద్దిగా, చింత‌పండు – ఉసిరికాయంత‌, ఉప్పు – త‌గినంత‌.

Pachi Mirchi Tomato Pappu recipe in telugu make in this method
Pachi Mirchi Tomato Pappu

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 6, పొడవుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో ప‌ప్పు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత నీళ్లు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, ట‌మాటాలు,ప‌సుపు, ధ‌నియాల పొడి, క‌రివేపాకు, కొత్తిమీర‌, చింత‌పండు వేసి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 4 నుండి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, వెల్లుల్లి రెమ్మ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ఉడికించిన ప‌ప్పు వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని జొన్న రొట్టెలు, అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన ప‌ప్పును లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts