Raju Gari Kodi Pulao : హోట‌ల్స్‌లో ల‌భించే రాజు గారి కోడి పులావ్‌.. ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Raju Gari Kodi Pulao : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో రాజు గారి కోడి పులావ్ కూడా ఒక‌టి. చికెన్ తో ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది ఈ పులావ్. రాజు కోడి పులావ్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులావ్ ను ఎవ‌రైనా చాలా తేలిక‌గా చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే రాజు గారి కోడి పులావ్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాజు గారి కోడి పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బియ్యం – ముప్పావు కిలో, చికెన్ – అర‌కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 50 గ్రా., త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, సాజీరా – ఒక టీ స్పూన్, బ్రౌన్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్.

Raju Gari Kodi Pulao recipe in telugu very easy to cook
Raju Gari Kodi Pulao

రాజు గారి కోడి పులావ్ త‌యారీ విధానం..

ముందుగాయ చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, బ్రౌన్ ఆనియ‌న్స్, కొత్తిమీర‌, పుదీనా, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి క‌ల‌పాలి. దీనిని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించాలి. జీడిప‌ప్పు ఎర్ర‌గా వేగిన త‌రువాత మ‌సాలా దినుసులు, సాజీరా వేసి వేయించాలి. త‌రువాత చికెన్, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. దీనిని 10 నిమిషాల పాటు వేయించిన త‌రువాత బియ్యం, కొత్తిమీర‌, పుదీనా, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ బియ్యానికి ఒక‌టిన్న‌ర గ్లాస్ చొప్పున నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

త‌రువాత మ‌ట్టి పాత్ర‌ను తీసుకుని దానికి నెయ్యి రాసుకోవాలి. త‌రువాత ఇందులో పులావ్ ను వేసుకోవాలి. త‌రువాత దీనిపై ఫ్రైడ్ ఆనియ‌న్స్ ను, కొత్తిమీర‌ను, పుదీనాను చ‌ల్లుకోవాలి. ఇప్పుడు దీనిని సిల్వ‌ర్ ఫాయిల్ తో మూసివేయాలి. త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి 3 నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పేప‌ర్ ను తీసేసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాజు గారి కోడి పులావ్ త‌యార‌వుతుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా రుచిగా కోడి పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts