టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి. టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి. దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే, అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది. ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాల బాగుంటుంది. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరు వెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి.
పరమాన్నం మరింత టేస్టీగా ఉండాలంటే, బియ్యాన్ని నెయ్యి వేసి కొంచెం సేపు వేయించి ఆ బియ్యంతో పరమాన్నం చేయాలి. ప్రూట్ కేక్స్ పై ఒక టీ స్పూను గ్లిజరిన్ వేస్తే తాజాగా ఉంటాయి. పులుసు, చారు మొదలైన వంటకాలలో పొరపాటున పులుపు ఎక్కువ పడవచ్చు. మజ్జిగ, పెరుగు మొదలైనవి విరివిగా పులిసి పోవచ్చు. అటువంటివాటిలో కొద్దిగా వంట సొడా కలిపితే మనకు కావలిసినంత రుచి తెచ్చుకోవచ్చు.
పూరీ పిండి కలిపేటప్పుడు సాధ్యమైనంత గట్టిగా కలుపుకుంటే పూరీలు నూనె పీల్చుకోవు. పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే, పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలిపి , పూరీ పిండి తయారు చేసుకోండి. ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.