Rice : అన్నం తింటే బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. అందువల్ల అన్నంకు బదులుగా చపాతీలను మాత్రమే తింటుంటారు. అయితే నిజానికి అన్నాన్ని తింటూ కూడా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడం కోసం అన్నాన్ని మానేయాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే బరువు పెరగకుండా ఉండడంతోపాటు బరువు తగ్గాలంటే.. అన్నాన్ని ఏవిధంగా వండుకుని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నాన్ని వండేటప్పుడు అందులో కూరగాయలు వేయాలి. క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వంటివి వేయాలి. దీంతో ఆ కూరగాయల్లో ఉండే ఫైబర్ కూడా మనం తినే అన్నంతోపాటు లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో మనం తినే అన్నం మనకు హాని చేయదు. కూరగాయలు ఉంటాయి కనుక వాటిల్లోని ఫైబర్ ఆ అన్నాన్ని నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ కూడా పెరగవు. పైగా ఇలాంటి అన్నాన్ని కొద్దిగా తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ ఆహారం తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
అయితే అన్నం వండేటప్పుడు అందులో కొద్దిగా కొబ్బరినూనె కూడా వేసి వండుకోవచ్చు. సాధారణంగా కొబ్బరినూనెతో చేసిన వంటలను ఎవరూ తినరు. కానీ కొబ్బరినూనెను అన్నంలో వేసి వండి తినవచ్చు. దీంతో కూడా అన్నం ద్వారా క్యాలరీలు చేరవు.
ఇక అన్నంలో కొద్దిగా నెయ్యి కలుపుకుని తిన్నా మేలు చేస్తుంది. ఇలా తింటే బరువు పెరుగుతామని భయపడతారు. కానీ ఒక టీస్పూన్ మోతాదులో నెయ్యి వేసి తినవచ్చు. ఇలా తింటే అన్నం వల్ల బరువు పెరగరు.
అయితే అన్నాన్ని అధిక మొత్తంలో మాత్రం తినరాదు. పైన చెప్పిన విధంగా వండుకుని కొద్ది మొత్తంలో తినవచ్చు. అన్నంకు బదులుగా చపాతీలు తినేవారు, అన్నం తినలేకపోతున్నామని బాధపడేవారు ఈ విధంగా అన్నం తినవచ్చు. దీంతో ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు.