Aluminium Vs Steel : మనం వంటగదిలో అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఈ వంటకాలను తయారు చేయడానికి అల్యూమినియం, స్టీల్, నాన్ స్టిక్ తో తయారు చేసిన వంట పాత్రలను వాడుతూ ఉంటాము. మనం వాడే వంట పాత్రలను బట్టి మనం చేసే వంటల రుచితో పాటు మన శరీర ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. నాన్ స్టిక్ వంట పాత్రలను టెప్లాన్ వంటి హాని కలిగించే రసాయనాలతో తయారు చేస్తారు.కనుక వీటిని వాడకూడదని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. చాలా మందికి వంటలు చేయడానికి అల్యూమినియంతో చేసిన వంట పాత్రలను వాడాలా.. స్టీల్ తో తయారు చేసిన వంట పాత్రలను వాడాలా.. అన్న సందేహం ఉంటుంది. అసలు వంట చేయడానికి స్టీల్ వంట పాత్రలు మంచివా.. అల్యూమినియం వంట పాత్రలు మంచివా.. ఈ రెండింటిలో దేనిని వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అల్యూమినియం వంట పాత్రలు మనకు చాలా తక్కువ ధరలో లభిస్తూ ఉంటాయి. అలాగే వీటిని గ్యాస్, ఒవెన్ వంటి వాటిపై సులభంగా ఉపయోగించవచ్చు. అలాగే వీటిని తేలికగా శుభ్రం చేసుకోవడానికి, దీర్ఘకాలం పాటు మన్నికంగా ఉండడానికి వీటిని హార్డ్ యానోడైజ్డ్ అల్యూమినియంతో తయారు చేస్తాయి. అలాగే కొన్నింటిని నాన్ యానోడైజ్డ్ అల్యూమినియంతో తయారు చేస్తారు. ఇవి ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండవు. అల్యూమినియం వంట పాత్రల్లో వండడం వల్ల మనం తయారు చేసే వంట సమానంగా ఉడుకుతుంది. అలాగే నిమ్మ, టమాట వంటి వాటిని కూడా మనం ఈ పాత్రల్లో సులభంగా వండుకోవచ్చు. అల్యూమినియం పాత్రల్లో వండడం వల్ల వీటిలో ఉండే ఆమ్లత్వం కారణంగా ఎటువంటి ప్రతిచర్య జరగకుండా ఉంటుంది.
అల్యూమినియం పాత్రల్లో వండడంమంచిదే అయినప్పటికి మంచి నాణ్యమైన, హార్డ్ యానోడైజ్డ్ అల్యూమినియంతో తయారు చేసిన వంట పాత్రలనే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాదపడే వారు అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇక స్టీల్ తో తయారు చేసిన వంట పాత్రలను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. మనకు మార్కెట్ లో నాణ్యమైన స్టీల్ తో తయారు చేసిన వంట పాత్రలు సులభంగా లభిస్తున్నాయి. ఇవి కూడా చాలా కాలం పాటు మన్నికగా ఉంటాయి. ఇవి 500 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత వరకు ఇవి తట్టుకోగలవు. అలాగే వీటిని శుభ్రం చేయడం కూడా చాలా సులభం.
టమాటాలు, నిమ్మరసంలో ఉండే ఆమ్లత్వం కారణంగా వీటిలో కూడా ఎటువంటి చర్య జరగదు. స్టీల్ వంట పాత్రలను క్రోమియం, నికెల్, ఐరన్ వంటి వాటితో తయారు చేస్తారు. ఇవి మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించవు. వీటిని వేడి చేసినప్పుడు తక్కువ మొత్తంలో విడుదలయ్యే కోబాల్ట్, ఐరన్ శరీరానికి హానిని కలిగించవనే చెప్పవచ్చు. అయితే నికెల్ ఎలర్జీ ఉన్న వారు స్టీల్ వట పాత్రలను ఉపయోగించకపోవడమే మంచిది. అల్యూమినియం మరియు స్టీల్ పాత్రలు రెండు మంచివే అయినప్పటికి స్టెయిన్ లెస్ స్టీల్ వంట పాత్రలను ఉపయోగించడం మరింత మంచిదని వీటిని వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.