Beetroot For Liver : ప్రతి ఒక్కరూ కూడా, అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండడం కోసమే చూస్తారు. చాలామంది, ఈరోజుల్లో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం పై, దృష్టి పెట్టడం కూడా చాలా అవసరం. లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టకపోతే, అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గాలంటే, కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవాళ్లు, సాయంత్రం 6 గంటలకే డిన్నర్ తీసేసుకోవాలి. ఉడికించిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కడ ఉన్నా తీసుకోవడం కుదరదు.
కానీ, పండ్లు అయితే ఎక్కడ ఉన్నా తీసుకోవడానికి అవుతుంది. కేవలం ఉడికించిన ఆహారము మాత్రమే ఆహారం కాదు. పండ్లు కూడా, ఆహారంగా మనం తీసుకోవచ్చు. పుచ్చకాయ, బొప్పాయి ఇలా ఏ పండ్లు దొరికితే, ఆ పండ్లు తీసుకోండి. సాయంత్రం ఆరున్నర లోగా డిన్నర్ తినేయాలి. పోషకాలు కూడా బాగా అందుతాయి. పండ్లు తీసుకోవడం వలన, శరీరం క్లీన్ అవుతుంది. రిపేర్ అవుతుంది.
మీరు ఇలా, త్వరగా తినేయడం, పైగా కేవలం పండ్లు మాత్రమే తినడం వలన, రాత్రి కడుపు ఖాళీ అయిపోతుంది. దీంతో క్యాలరీలు అందవు. కొవ్వు అనేది కరగడం మొదలవుతుంది. సాయంత్రం పండ్లు తిన్న తర్వాత, మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు, ఈ పండ్లు తిన్న క్యాలరీలు అలానే కొవ్వు మాత్రమే ఎనర్జీ కింద ఉపయోగపడతాయి. నిల్వ ఉన్న కొవ్వు నుండి శక్తి కరుగుతూ ఉంటుంది.
సో, ఈ సమస్య నుండి త్వరగా బయటపడడానికి అవుతుంది. ఇలా, తినడం వలన లివర్ కి పట్టిన ఫ్యాట్ కూడా కరుగుతూ ఉంటుంది. అందుకనే, ఇలా అనుసరించడం మంచిది. సాయంత్రం పూట ఆరోగ్య నిపుణులు చెప్పినట్లు ఇలా పాటించినట్లయితే, ఫ్యాటి లివర్ సమస్య నుండి బయటపడవచ్చు. అలానే, వారానికి ఒకసారి తినడం మానేసి, కేవలం తేనే, నిమ్మరసం నీళ్లలో కలుపుకుని తాగడం చేస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా ఉపవాసం చేయడం వలన లివర్ ఫ్యాట్ కరుగుతుంది.