పెరుగు అనేక భారతీయ ఆహార పదార్థాలలో ఒకటిగా ఉంది. చాలా మంది భోజనం చేసిన తరువాత పెరుగును తింటుంటారు. భోజనం చివర్లో పెరుగుతో అన్నంలో కలుపుకుని తినకపోతే కొందరికి భోజనం చేసిన భావన కలగదు. అయితే పెరుగుతో నిజానికి మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బీఎంఐని ఆరోగ్యకరమైన రీతిలో ఉంచుతుంది. దీంతోపాటు అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడుతుంది. పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని ఇస్తాయి. బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి.
పెరుగును తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఇది అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడుతుంది. అందువల్ల రోజూ పెరుగును తింటే అధిక బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే పెరుగును రోజూ 3 సార్లు తినాల్సి ఉంటుంది. మొత్తం 3 సార్లు పూటకు ఒక కప్పు చొప్పున తినాలి. అందులో వెన్న తీసి ఉండాలి. వెన్నలేని పాలతో తయారు చేసిన పెరుగు అయితే మంచిది. ఇక అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి లేదా చియా విత్తనాలు, మెంతుల పొడి వంటివి ఏదైనా ఒకటి ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తినాలి. దీంతో అధిక బరువు తగ్గుతారు.
ఈ చిట్కాను క్రమం తప్పకుండా రోజూ పాటిస్తే అధిక బరువును తగ్గించుకోవచ్చు. పెరుగులో ఉండే పోషకాలు బరువును తగ్గిస్తాయి. బరువును నియంత్రణలో ఉంచుతాయి.