Black Cardamom : నల్ల యాలకులు.. మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో ఇవి కూడా ఒకటి. కానీ చాలా మందికి ఈ నల్ల యాలకుల గురించి ఎక్కువగా తెలియదు. ఈ యాలకులు నల్లగా, పైన ముడతలుగా, కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఇవి కొద్దిగా సిట్రస్, యూకలిప్టస్ ప్లేవర్స్ తో ఉంటాయి. మసాలా వంటకాల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ నల్ల యాలకులను ఎక్కువగా మన దేశంతో పాటు నేపాలు, భూటాన్ దేశాల్లో పండిస్తూ ఉంటారు. అయితే మొత్తం నల్ల యాలకుల్లో సగానికి పైగా నల్ల యాలకులను మన దేశంలోనే పండిస్తున్నారు. సాధారణ యాలకుల వలె నల్ల యాలకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
నల్ల యాలకులను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల యాలకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నల్ల యాలకులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు, వాతావరణ మార్పుల కారణంగా కలిగే అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయంలో ఉండే మలినాలు, విష పదార్థాలు పూర్తిగా డిటాక్స్ చేయబడతాయి. అలాగే నల్లయాలకులను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బీపీ అదుపులో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే నల్ల యాలకులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆకలి పెరుగుతుంది. అంతేకాకుండా నల్ల యాలకులను నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే నల్ల యాలకులను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల స్త్రీల్లలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా నల్ల యాలకులు మనకు సహాయపడతాయి. బ్రాంకైటిస్, ఆస్థమా, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో నల్ల యాలకులు దోహదపడతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేటప్పుడు వీటిని తీసుకోవడం వల్ల మచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా నల్ల యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.