Cinnamon And Lemon : మనకు సులభంగా లభించే పదార్థాలతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, కూర్చొని పని చేయడం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల చేత చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. లేదంటే ఈ సమస్య తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
అధిక బరువు సమస్యతో బాధపడే వారు సులభంగా బరువు తగ్గాలంటే ఇప్పుడు చెప్పే కషాయాన్ని తయారు చేసి తీసుకోవాలి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ కషాయాన్ని తయారు చేయడం చాలా సులభం. బరువు తగ్గించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే 15 పుదీనా ఆకులు, 5 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, అర టీ స్పూన్ అల్లం తురుము, 4 లేదా 5 నిమ్మకాయ ముక్కలు వేసి మరిగించాలి. ఈ నీటిని గ్లాస్ అయ్యే వరకు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తీసుకోవాలి.
ఇలా రోజూ ఒక గ్లాస్ మోతాదులో ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరిగి మనం సులభంగా బరువు తగ్గవచ్చు. పొట్టతో పాటు ఇతర శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా సులభంగా కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.