Coffee With Coconut Oil : మనలో చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతారు. కొందరు ఉదయం లేచిన వెంటనే వారి రోజును కాఫీతో ప్రారంభిస్తారు. కాఫీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మనసుకు ఫీఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలా కాఫీని తాగే వారు అదే కాఫీలో కొబ్బరి నూనను కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో కొబ్బరి నూనెను కలపడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా… కానీ కొబ్బరి నూనెను కాఫీలో కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో కొబ్బరి నూనెను కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు కాఫీలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి బాగా కలుపుతూ వేడి చేయాలి. తరువాత దీనిని కప్పులో పోసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చు. ఇలా కాఫీలో కొబ్బరి నూనెను కలిపి తీసుకోవడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు, ఆస్ట్రియో పోరోసిస్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ప్రవేశించిన వ్యాధికారక క్రిములు, బ్యాక్టీరియాలు నశిస్తాయి. ఇలా కాఫీలో కొబ్బరి నూనె కలిపి తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఆలోచనా విధానం మెరుగుపడుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా నరాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
అదే విధంగా కాఫీలో కొబ్బరినూనె కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మన తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం చక్కగా గ్రహిస్తుంది. ఇక డయాబెటిస్ తో బాధపడే వారు కాఫీలో కొబ్బరి నూనె కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా కాఫీని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డిప్రెషన్ ను తగ్గించడంలో అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో కూడా ఈ విధంగా తయారు చేసుకున్న కాఫీ మనకు దోహదపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కాఫీలో కొబ్బరి నూనెను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా కాపీలో కొబ్బరి నూనెను కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.