ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రి పూట అన్నం తినకుండా చపాతీలు లేదంటే పుల్కాలని తింటూ ఉంటారు.అయితే నూనె లేకుండా కొందరు రోటీలని లేదంటే పుల్కాలని డైరెక్ట్‌గా గ్యాస్ స్టవ్ మంటపైనే కాల్చేస్తారు. ఇలా కాల్చిన చపాతీలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ నుంచి విడుదలయ్యే హానికర రసాయనాలు క్యాన్సర్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. వంటగ్యాస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటివి విడుదల కావడంతో శ్వాసక్రియ, జీర్ణక్రియ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ మీద చపాతీలు కాల్చేటప్పుడు గ్యాస్ స్టవ్ మండేటందుకు ఇంధనం అయిన గ్యాస్ లో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ తో పాటు సూక్ష్మ రేణువులు ఉంటాయని ఇవి మండినప్పుడు కాలుష్యాన్ని విడుదల చేస్తాయని చెప్తున్నారు.
చపాతీలను నేరుగా మంటపై అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వలన కార్సినోజెనిక్ సమ్మేళనాలు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు . అంతేకాదు గ్యాస్ స్టవ్ పైన నేరుగా చపాతీలను పెట్టి కాల్చినప్పుడు నేరుగా ఉష్ణోగ్రత తగలడం వల్ల చపాతీలు మాడిపోయే అవకాశం కూడా ఉంటుందని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. చపాతీలు తొందరగా కావడంతో పాటు గ్యాస్ ఆదా అవుతుందని ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలను కోరితెచ్చుకున్నట్లే. ఇలా గ్యాస్ మీద కాకుండా బొగ్గులపై చపాతీలు కాల్చడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
ముందు రోజుల్లో రోటిని కాల్చేప్పుడు ఏదైనా గుడ్డతో రోటీపై నొక్కేవారు. దీంతో రోటీ మొత్తం బాగా కాలేది. కానీ, పటకారు వచ్చాక.. చాలా మంది రోటీని మంటపైనే కాలుస్తున్నారు. ఈజీగా ఉండడం, రోటీ అన్నివైపులా త్వరగా కాలి పని ఈజీ అవ్వడం వల్ల చాలా మంది ఇలానే చేస్తున్నారు.ఇప్పటివరకు జరిగిన అనేక పరిశోధనలు గ్యాస్ స్టవ్ పైన నేరుగా కాల్చిన ఆహారం తినడం మంచిది కాదని తేల్చాయి. ఒక చపాతీలు మాత్రమే కాదు గ్యాస్ స్టవ్ పైన నేరుగా వేటిని కాల్చి తిన్నా ప్రమాదమేనని అవి పేర్కొన్నాయి. కనుక మనం తినే ఆహారం విషయంలో ఏది ఎలా వండుకు తినాలి అనేది కూడా కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది.హాంబర్గర్స్‌ని ఎక్కువగా తినేవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ఓ పరిశోధన చెబుతోంది.